చికెన్ చిల్లీ గీ రోస్ట్ - Google Thalli
News Update
Loading...

Wednesday, April 1, 2020

చికెన్ చిల్లీ గీ రోస్ట్


రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే చికెన్ చిల్లీ గీ రోస్ట్ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
  • చికెన్ - 600గ్రాములు (బోన్ లెస్ మరియు చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
  • పెరుగు - 4టేబుల్ స్పూన్లు
  • నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2టేబుల్ స్పూన్లు
  • పసుపు - చిటికెడు
  • బెల్లం లేదా పంచదార - 1 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
  • రుచికి సరిపడా ఉప్పు
  • కరివేపాకురెమ్మలు - 5
  • ఎండు మిర్చి - 10
  • జీలక్ర - ½ టీస్పూన్
  • మెంతులు - ¼th టీస్పూన్
  • దనియాలు - 1 టేబుల్ స్పూన్లు
  • పచ్చికొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు (రోస్ట్ చేసుకోవాలి)
  • సోంపు - ½ టీస్పూన్
  • లవంగాలు - 2
  • దాల్చిన చెక్క - 2
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్లు
  • చింతపండు గుజ్జు - ½ టీస్పూన్

తయారు చేయు విధానం
  1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి తక్కువ మంట మీద అన్ని రకాల మసాలాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. 
  2. అలాగే ఎండు మిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.వేయించుకున్న పదార్థాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి, అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాలు, పెరుగు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. 
  4. మ్యారినేషన్ సమయంలోనే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి.  
  5. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి.  
  6. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన చికెన్, వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే 1/4కప్పు నీళ్ళు జోడించి, చిక్కగా ఉడికించాలి. మరీ గ్రేవీలా కాకుండా చిక్కగా ఉండేట్లు చూసుకోవాలి.  
  7. ఇప్పుడు, కొబ్బరి తురుము, చింతపండు పేస్ట్, బెల్లం, నెయ్యి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.  
  8. అవసరమైతే అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవచ్చు. మొత్తం మిశ్రమాన్ని 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.  
  9. అంతే చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి రెడీ .వేడి వేడిగా వడ్డించడమే ఆలస్యం ఇష్టంగా తినేస్తారు.

Share with your friends

Add your opinion
Disqus comments
Notification
Welcome to Google Thalli
Done